కశ్మీర్, అక్టోబర్ 27: కశ్మీర్లో పండిట్లు వరుస హత్యలకు గురవుతున్నా.. కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. షోపియాన్ జిల్లా చౌదరి గుండ్లో ఈనెల 15న పూరన్ కృష్ణణ్ భట్‌ను ఉగ్రవాదులు ఇంటి వద్ద కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గ్రామానికి చెందిన 10 కశ్మీరీ పండిట్ కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దాదాపు 40 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జమ్ముకు చేరుకొన్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఇది నిరాధారమని జిల్లా యంత్రాంగం చెప్పుకొచ్చింది. దీనిపై కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (కేపీఎస్‌ఎస్) తీవ్రంగా స్పందించింది. ‘కశ్మీర్ లోయలో వారికి అయితే అంతా బాగుంది. అసమర్థత బీజేపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కశ్మీర్లో శాంతి భద్రతలను చీకట్లోకి నెట్టాయని ట్విట్టర్లో విమర్శించింది.