EPFO | న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు గొప్ప ఉపశమనం లభించింది. ఆన్లైన్ విత్డ్రాయల్స్ నిబంధనలను ఈపీఎఫ్ఓ సరళతరం చేసింది. క్లెయిముల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు ప్రయోజనం కలుగుతుంది.