నిరసనలతో ఈసీ వెనుకడుగు!
ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై తీవ్ర నిరసనల నేపథ్యంలో ప్రతిపక్షాలతో దీర్ఘకాలంగా విభేదాలకు కారణమవుతున్న రెండు అంశాలపై ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. గడచిన కొంత కాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం గత 24 గంటల్లో రెండు ప్రధాన నిర్ణయాలను తీసుకున్నది.
- 24 గంటల్లో రెండు కీలక చర్యలపై ఉత్తర్వులు
- 17 రాష్ర్టాలు, యూటీల్లో ‘సర్’కు బదులుగా ఎస్ఎస్ఆర్ అమలు
- రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాల పీడీఎఫ్ కాపీలపై హామీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై తీవ్ర నిరసనల నేపథ్యంలో ప్రతిపక్షాలతో దీర్ఘకాలంగా విభేదాలకు కారణమవుతున్న రెండు అంశాలపై ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. గడచిన కొంత కాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం గత 24 గంటల్లో రెండు ప్రధాన నిర్ణయాలను తీసుకున్నది. అందులో భాగంగా కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు 17 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సమీక్ష(ఎస్ఎస్ఆర్)ప్రక్రియను చేపడుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మొదటిసారిగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు తుది ఓటర్ల జాబితాలకు చెందిన శోధించగలిగే పీడీఎఫ్ ప్రతులను అందచేస్తామని హామీ ఇచ్చింది.
తద్వారా ఇంతకాలం తాను అనుసరిస్తూ వచ్చిన పాత వైఖరిని మార్చుకుంది. ఈ రెండు అంశాలను ఇటీవలి సంవత్సరాలలో ప్రతిపక్షాలు పదేపదే లేవనెత్తాయి. 2018లో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత గోప్యతా సమస్యలను ఉటంకిస్తూ యంత్రాలు చదవగలిగే ఓటర్ల జాబితాలను విడుదల చేయడాన్ని ఈసీఐ స్వయంగా వ్యతిరేకించింది. కాగా, ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని తానే మార్చుకున్నట్టు సూచించింది. ఇప్పటివరకు ఈసీఐ కేవలం చిత్రం మాత్రమే ఉన్న లేదా స్కాన్ చేసిన పీడీఎఫ్లను మాత్రమే అందించింది. వీటిలో శోధించడం సాధ్యం కాదు. సాధారణంగా వీటిలోని పదాలు ఎంచుకోవడం, శోధించడం లేదా కాపీ చేయడం కూడా కుదరదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

