Exam Hall | పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై.. ఎగ్జామ్ హాల్ ప్రభావం
పరీక్ష రాసే గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Exam Hall | న్యూఢిల్లీ: పరీక్ష రాసే గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సీలింగ్ ఎక్కువ ఎత్తులో ఉన్న గదిలో పరీక్ష రాసిన విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. దక్షిణ ఆస్ట్రేలియా, డీకెన్ యూనివర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనం ప్రకారం, ‘పరీక్షల్లో మీరు ఎలా రాణిస్తారన్నది సబ్జెక్ట్‌పై అవగాహన, ప్రిపరేషన్‌పై ఆధారపడి ఉంటుంది.
చాలా కాలంగా అందరూ ఇదే వాస్తవమని నమ్ముతున్నారు. అయితే ఇది పూర్తి నిజం కాదు’ అని అధ్యయనం పేర్కొన్నది. ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన 15,400 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఫలితాల్ని (2011-2019 మధ్య) పరిశోధకులు విశ్లేషించి పై నివేదికను తయారుచేశారు. పరీక్ష గది సీలింగ్ ఎత్తుకు..అందులో పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులకు ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. సీలింగ్ ఎత్తు ఎక్కువగా ఉన్న గదుల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినట్టు వారి పరిశీలనలో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

