Delhi Liquor Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
గెహ్లాట్ ప్రస్తుతం నజఫ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్ తరచూ ఫోన్ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

