Sandeshkhali | షేక్ షాజాహాన్పై భూ ఆక్రమణ కేసు.. సందేశ్‌ఖాలీలో ఈడీ సోదాలు
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తున్నది. భూ ఆక్రమణ కేసుతో టీఎంసీ బహిష్కృత నేత, సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటన నిందితుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) ప్రమేయంపై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తున్నది. భూ ఆక్రమణ కేసుతో టీఎంసీ బహిష్కృత నేత, సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటన నిందితుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) ప్రమేయంపై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి షాజహాన్‌కు చెందిన ఇటుక బట్టితోపాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. గతంలో తనిఖీలకు వెళ్లిన బృందాలపై దాడులు జరిగిననేపథ్యంలో సందేశ్‌ఖాలీలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు.
రేషన్ పంపిణీ కుంభకోనాన్ని విచారించేందుకు వెళ్లిన సందర్భంలో ఈడీ అధికారులపై గత నెల 5న షేక్ షాజహాన్, అతని అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడి మహిళలను టార్గెట్ చేస్తూ టీఎంసీ గుండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళలు షేక్ షాజహాన్, ఇతర టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సందేశ్‌ఖాలీ పేరు మారుమోగింది. ఈ ఘటనల తర్వాత షేక్ షాజహాన్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. సీబీఐ, ఈడీ లేదా పోలీసులు అతన్ని అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
కాగా, ఈడీ బృందంపై దాడికేసులో షాజహాన్ సోదరుడు షేక్ ఆలంగిర్కు సీబీఐ నోటీసులు జారీచేసింది. అతనితోపాటు మరో ఏడుగిరి కూడా తాఖీదులు ఇచ్చింది. కోల్‌కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

