మా ఇంట్లో ఈడీ ఆఫీసు పెట్టుకోండి: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్
ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు, బీహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీ ఛానల్ (ఎన్డీటీవీ) ద్వారా నేను ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐకి ఆహ్వానం అందిస్తున్నా..
- సీబీఐ కూడా రావొచ్చు.. ఫ్రీగా స్థలం ఇస్తా
- బీజేపీ సెల్స్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలు
- మోదీని దించేందుకు విపక్షాలు ఏకం కావాలి
నేను ఈడీ, ఆదాయం పన్ను శాఖ, సీబీఐకి ఆహ్వానం అందిస్తున్నా.. వాళ్లు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులు తెరుచుకోవచ్చు. ఇప్పుడు వెళ్లి.. మరో రెండు నెలల తర్వాత సోదాల పేరిట రావడమెందుకు? మాతోనే కలిసి ఉండొచ్చు.
-తేజస్వీ యాదవ్
పాట్నా, ఆగస్టు 11: ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు, బీహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీ ఛానల్ (ఎన్డీటీవీ) ద్వారా నేను ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐకి ఆహ్వానం అందిస్తున్నా.. వాళ్లు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులను తెరుచుకోవచ్చు.
ఇప్పుడు వెళ్లి.. మరో రెండు నెలల తర్వాత సోదాల పేరిట రావడమెందుకు? మాతోనే కలిసి ఉండొచ్చుగా’ అన్నారు. ఈడీ, సీబీఐ.. బీజేపీ పార్టీ సెల్‌గా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. నితీశ్‌తో జట్టుకట్టడం గురించి స్పందిస్తూ.. ముందస్తు ప్లాన్‌లో భాగంగా తాము కలవలేదని, అనుకోకుండానే ఇది జరిగిందన్నారు. బీజేపీతో కలిసి ఉన్నంతకాలం నితీశ్ అసౌకర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. 2024లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ పోటీచేయవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మోదీనే ప్రధాని అయినప్పుడు.. నితీశ్ ఎందుకు కాకూడదు?’ అని ఎదురు ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసిరావాలని, ఈ మేరకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

