దంత వైద్యుడి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. అదేలాగో తెలుసా..?
న్యూఢిల్లీ : యాపిల్ వాచ్ టైమ్‌ను చూసుకునేందుకే పరిమితం కాలేదు. సకాలంలో ఓ దంత వైద్యుడి ప్రాణాలను కూడా కాపాడింది. అది ఎలాగంటే.. ఆ వాచ్‌లోని ఫీచర్స్ వల్లే. యాపిల్ వాచ్‌లోని ఎలక్ట్రో కార్డియో గ్రామ్ ( ECG ) ఫీచర్ ద్వారా తన హార్ట్‌బీట్‌ను తెలుసుకున్నాడు. హార్ట్ బీట్ అసాధారణంగా ఉండటంతో అప్రమత్తమైన సదరు డాక్టర్.. సమీపంలోని కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లిన తన ప్రాణాలను రక్షించుకున్నాడు.
హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన నితీష్ చోప్రా(33) వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే తన భార్య బర్త్‌డే సందర్భంగా యాపిల్ వాచ్‌ను కొనుగోలు చేశాడు. తాను అనారోగ్యంగా ఉన్నట్లు నితీష్ నిర్ధారించుకుని.. రెండు సార్లు తన యాపిల్ వాచ్‌లో ఈసీజీ చెక్ చేసుకున్నాడు. హార్ట్ బీట్ అసాధారణంగా ఉన్నట్లు తేలింది. దీంతో తక్షణమే డెంటిస్ట్.. కార్డియాలజిస్ట్‌ను సంప్రందించి పరీక్షలు చేయించుకున్నాడు. హార్ట్‌లో బ్లాక్‌లు ఉన్నట్లు యాంజియోగ్రాఫి రిపోర్టులో తేలింది. తప్పనిసరిగా స్టెంట్ వేయించుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నితీష్ భార్య నేహా నగల్ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్ కంపెనీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్కు ఈ-మెయిల్ ద్వారా సందేశం పంపానని చెప్పింది. మా వాచ్ ద్వారా అత్యవసరమైన సమయంలో వైద్య సహాయం లభించినందుకు సంతోషిస్తున్నానని, ఆరోగ్యంగా ఉండాలని టిమ్ కుక్ రిప్లై ఇచ్చినట్లు నేహా పేర్కొంది.
నితీష్ చోప్రా మార్చి 8 నుంచి 12వ తేదీ మధ్యలో అనారోగ్యంగా ఉన్నాడని నేహా తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడం, ఇతర సమస్యలు ఉత్పన్నం కావడంతో.. యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ ద్వారా హార్ట్ బీట్ తెలుసుకోగలిగామని తెలిపింది. హార్ట్ బీట్ అసాధారణంగా ఉండటంతో.. హాస్పిటల్లోనూ ఈసీజీ, యాంజియోగ్రామ్ చేయించడంతో బ్లాక్‌లు ఉన్నట్లు తేలిందని ఆమె చెప్పింది. ఇంత చిన్న గాడ్జెట్ తన ప్రాణాన్ని కాపాడినందుకు నితీష్ చోప్రా సంతోషం వ్యక్తం చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

