న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. ‘కర్ణాటక ప్రతిష్ఠ, సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించే ఎవరినీ కాంగ్రెస్ అనుమతించదు’ అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నోటీసులు ఇచ్చింది. సోనియా వ్యాఖ్యలు విభజన వాదాన్ని కలిగి ఉన్నాయంటూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దేశాలకే సార్వభౌమత్వం ఉంటుందని, కర్ణాటక భారత్లో భాగమని ఫిర్యాదులో పేర్కొన్నారు.