Earth Quake | సిక్కింలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3గా నమోదైంది. ఆదివారం రాత్రి 9.50 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుంది. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌కు తూర్పు-ఆగ్నేయ దిశన 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలాజీ (ఎన్సీఎస్ తెలిపింది.
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్, కలింపాంగ్ జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆరు కిలోమీటర్ల లోతు వరకు భూకంప తీవ్రత ఆధారపడి ఉంది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు తెలిపాయి.
Earthquake of Magnitude:4.3, Occurred on 07-11-2021, 21:50:45 IST, Lat: 27.25 & Long: 88.77, Depth: 6 Km ,Location: 18km ESE of Gangtok, Sikkim for more information download the BhooKamp App https://t.co/gezBFgTQnK pic.twitter.com/51eyEb70tT
— National Center for Seismology (@NCS_Earthquake) November 7, 2021