ఇంటర్నెట్లో ఈ-ముద్ర ప్రకంపనలు
భారత ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఈ ముద్ర’ జారీ చేసిన ఎనిమిది డిజిటల్ సెక్యూరిటీ సర్టిఫికెట్లలో ఊహించని సాంకేతికలోపం బయటపడటంతో అంతర్జాతీయ సైబర్ రంగంలో తీవ్ర దుమారం చెలరేగింది. సాధారణంగా వెబ్సైట్ల గుర్తింపును, భద్రతను ధ్రువీకరించేందుకు ఉపయోగించే ప్రైవేట్ సీక్రెట్ కీలు, అత్యంత క్లిష్టంగా, వందల సంఖ్యల కాంబినేషన్‌తో ఉండాలి.
- సంస్థ సెక్యూరిటీ సర్టిఫికెట్లలో బలహీనమైన ‘కీ’లు
- విచారణకు ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఈ ముద్ర’ జారీ చేసిన ఎనిమిది డిజిటల్ సెక్యూరిటీ సర్టిఫికెట్లలో ఊహించని సాంకేతికలోపం బయటపడటంతో అంతర్జాతీయ సైబర్ రంగంలో తీవ్ర దుమారం చెలరేగింది. సాధారణంగా వెబ్సైట్ల గుర్తింపును, భద్రతను ధ్రువీకరించేందుకు ఉపయోగించే ప్రైవేట్ సీక్రెట్ కీలు, అత్యంత క్లిష్టంగా, వందల సంఖ్యల కాంబినేషన్‌తో ఉండాలి. కానీ ఈ ముద్రకు చెందిన గ్లోబల్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్(పీకేఐ) జారీ చేసిన ఎనిమిది ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లలో ఉపయోగించిన సీక్రెట్ కీలు కేవలం 4, 56, 66, 115, 156, 230, 237 వంటి అతి చిన్న సాధారణ సంఖ్యలుగా ఉండటాన్ని ఓ పరిశోధకుడు గుర్తించారు.
ఇంతటి బలహీనమైన కీలను ఆధునిక కంప్యూటర్ల సాయంతో సెకను కంటే తక్కువ సమయంలోనే క్రాక్ చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల హ్యాకర్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, నిజమైన సర్టిఫికెట్లుగా భ్రమించే అవకాశం ఉండేది. తద్వారా వినియోగదారులు నకిలీ సర్టిఫికెట్లను నిజమైనవిగా నమ్మే ప్రమాదం ఉండేది. కాగా లోపం వెలుగులోకి వచ్చిన దరిమిలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వెంటనే స్పందించి, సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయపటడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు కఠిన చర్యలు చేపట్టాయి. గూగుల్, మొజిల్లా సంస్థలు ప్రభావితమైన సర్టిఫికెట్లను తమ బ్రౌజర్లలో తక్షణమే బ్లాక్ చేశాయి.
ఇంతేకాకుండా క్రోమ్ విశ్వసనీయ జాబితా నుంచి ఈ ముద్ర రూట్ సర్టిఫికెట్‌ను తొలగించే ప్రక్రియను కూడా గూగుల్ ప్రారంభించింది. వినియోగదారులు తమ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లను తాజా వెర్షన్లకు అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ తరహా నకిలీ సర్టిఫికెట్ల ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. తాజా వివాదం నేపథ్యంలో టీఎల్ఎస్ సర్టిఫికెట్ బిజినెస్ నుంచి వైదొలగుతున్నట్లు ఈ- ముద్ర ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

