బుర్జ్ ఖలీఫా టవర్‌ని ప్రతిబింబించేలా దుర్గా పూజ మండపం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దసరా సందర్భంగా వివిధ ఆకృతుల్లో దుర్గా పూజ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇందులో భాగంగా కోల్‌కతాలోని లేక్ టౌన్లో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్‌ని ప్రతిబింబించేలా దుర్గా పూజ పండల్‌ను నిర్మించారు. ప్రతి ఏటా ఐకానిక్ భవనాల ప్రతిరూపంలో దుర్గా మాతా మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సుజిత్ బోస్ తెలిపారు. గతంలో పారిస్‌లోని ఒపెరా, కేదార్నాథ్, పూరీ జగన్నాథ ఆలయం థీమ్ ఆధారంగా పండల్స్ను నిర్మించినట్లు ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఏర్పాటు చేసిన 145 అడుగుల పొడవైన బుర్జ్ ఖలీఫా టవర్‌ని పోలిన మండపం రాత్రిపూట ప్రత్యేకంగా వెలుగులు విరజిమ్ముతుందని మంత్రితోపాటు శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ చీఫ్ అయిన సుజిత్ బోస్ తెలిపారు. దీని కోసం ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ మండపం నిర్మాణం కోసం 250 మంది కార్మికులు రెండు నెలలపాటు శ్రమించారని ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

