Tiger vs Duck | బాతు, పులి మధ్య పోరాటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ముందు అసలు పోరాటం అవుతుందా అది అంటారా? అవును.. పులి తలుచుకుంటే బాతును ఒకే ఒక దెబ్బతో చంపేయగలదు. కానీ.. అది బయట ఉన్నప్పుడు.. నీళ్లలో ఉన్నప్పుడు కాదు కదా.
అవును.. ఓ కొలనులో బాతు, పులి రెండింటి మధ్య జరిగిన హైడ్ అండ్ సీక్ గేమ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పులి తన దగ్గరికి రాగానే బాతు నీళ్లలో మునగడం.. బాతు నీళ్లలో మునగడం చూసి పులి షాక్ అవడం.. మళ్లీ బాతు నీళ్లలో నుంచి పైకి రావడం.. దాన్ని చూసి పులి దగ్గరికి రాబోయేసరికి మళ్లీ నీళ్లలో మునగడం.. ఇదంతా ఒక ఆటలా అనిపిస్తుంది. చివరకు పులి ఏం చేయలేక నిస్సాయక స్థితిలో ఉండిపోతుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండటంతో నెటిజన్లు ఆ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైండ్ అండ్ సీక్ ఆట బాగుందని కామెంట్లు చేస్తున్నారు.