Viral Video | ఓ తాగుబోతు పీకల దాకా మద్యం సేవించాడు. ఇక ఓ పార్కులోని బెంచీలో వాలిపోయాడు. అలానే నిద్రలోకి జారుకున్నాడు. అటుఇటు కదిలే క్రమంలో అతని బెంచీ మధ్యలో ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులు అతన్ని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. స్థానికంగా ఉన్న రామ్‌లీలా పార్కులో వాలిపోయాడు ఆ మందుబాబు. ఆ తర్వాత అక్కడే ఉన్న బెంచీపై పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర మత్తులో ఉన్న అతను.. బెంచీ మధ్యలో ఇరుక్కుపోయాడు. కాళ్లేమో భూమ్మీద ఉన్నాయి. తలనేమో బెంచీ మధ్యలో ఇరుక్కుంది. దీంతో స్పృహలోకి వచ్చిన అతను తనను కాపాడంటూ కేకలు వేశాడు.
స్థానికులు అతని అరుపులను గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. రామ్‌లీలా పార్కుకు చేరుకున్న ఇద్దరు పోలీసులు.. నెమ్మదిగా అతని తలను బెంచీ మధ్యలో బయటకు తీశారు. అతని మెడకు స్వల్ప గాయమైంది. ఆ మందుబాబు ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతని వివరాలు తెలుసుకుని ఇంటికి పంపించారు పోలీసులు.
“सुरक्षा आपकी, संकल्प हमारा”…
थाना स्वरूपनगर अन्तर्गत रामलीला पार्क में एक व्यक्ति की गर्दन पार्क में लगाई गई बेंच में बुरी तरीके से फंस जाने से जान जोखिम की सूचना रात्रि करीब 01:00 बजे मिली। सूचना पर तत्काल चौकी प्रभारी बेनाझाबर उप निरीक्षक श्री कविन्द्र खटाना , प्रशिक्षु उप… pic.twitter.com/fDHMzChgaw
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) April 8, 2024