లక్నో: ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైల్వే ట్రాక్‌పై నడిపాడు. దీంతో రైలు పట్టాల వద్ద అది ఆగిపోయింది. (Drunk Man Drives SUV On Railway Track) అక్కడ చిక్కుకున్న ఆ కారును చూసి రైల్వే అధికారులు షాక్ అయ్యారు. ఆ పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలును ఆపేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 7 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక కారు భీమ్‌పూర్ రైల్వే గేటు వద్దకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ మలుపులో కారును వేగంగా రైల్వే ట్రాక్‌పైకి నడిపాడు. దీంతో రైలు పట్టాలపై 50 మీటర్ల దూరం వెళ్లిన ఆ కారు అక్కడ ఆగిపోయింది.
కాగా, రైలు పట్టాలపై చిక్కుకున్న కారును రైల్వే అధికారులు గమనించి షాక్ అయ్యారు. వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అదే ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. హైడ్రాలిక్ వాహనాన్ని రప్పించి ట్రాక్‌పై చిక్కుకున్న కారును అక్కడి నుంచి తొలగించారు. దీంతో 35 నిమిషాల తర్వాత ఆ గూడ్స్ రైలు అక్కడి నుంచి కదిలింది. రైల్వే పోలీసులు ఆ కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अमरोहा : शराब के नशे में रेलवे ट्रैक पर दौड़ी कार
50 मीटर तक रेलवे ट्रैक पर दौड़ती रही कार
रेलवे ट्रैक पर कार दौड़ने से रेलवे अधिकारियों में मंचा हकडम
रेलवे ट्रैक पर ट्रेन आने से हो सकता था कोई बड़ा हादसा
रेलवे फाटक पर गेटमैन ने कार से पूरी फैमली बाहर निकलवाया
रेलवे ट्रेक आ… pic.twitter.com/CCEkrbi4he
— News1India (@News1IndiaTweet) February 9, 2025