పాట్నా: వేదికపై ప్రసంగిస్తున్న బీజేపీ నేతకు ఒక తాగుబోతు షాక్ ఇచ్చాడు. వేదిక పైకి వెళ్లి ఆయన ముఖంపై ప్లాస్టిక్ కవర్‌ను విసిరాడు. దీంతో షాకైన బీజేపీ నేత అతడ్ని పక్కకు తీసుకెళ్లాలంటూ కార్యకర్తలకు సైగ చేశాడు. బీహార్‌లోని బెట్టియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడుతుండగా మద్యం సేవించి ఉన్న వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా వేదికపైకి ఎక్కిన ఆ తాగుబోతు సంజయ్ కాళ్లకు నమస్కరించాడు. అనంతరం అక్కడ పడి ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను బీజేపీ అధ్యక్షుడి ముఖంపైకి విసిరాడు. షాక్ అయిన ఆయన ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ కార్యకర్తలకు సైగ చేశాడు. దీంతో మద్యం సేవించిన వ్యక్తిని వేదిక నుంచి కిందకు తీసుకెళ్లారు.
మరోవైపు ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ప్రయత్నించారు. మొన్నటి వరకు బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి ఉన్న సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. నితీశ్ జీ హయాంలోని లిక్కర్ కహానీ మన కళ్ల ముందు ఇలా కనిపిస్తున్నదని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మహారాష్ట్రలోని శివసేనను మాదిరిగా బీహార్‌లో జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది. దీంతో నితీశ్ కుమార్ అప్రమత్తమయ్యారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
BJP का मंच और सामने शराबी! बेतिया में शुक्रवार को बीजेपी का कार्यक्रम था. इसी दौरान मंच पर एक शराबी पहुंच गया. देखिए कैसे बीजेपी प्रदेश अध्यक्ष संजय जायसवाल ने नीतीश कुमार पर चुटकी ली. वीडियो- बेतिया से कैलाश.Edited by @iajeetkumar pic.twitter.com/AllupsnWBj
— Prakash Kumar (@kumarprakash4u) October 1, 2022