న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: భూతాపంతో భారత్లో దీర్ఘకాలికంగా కరువు పరిస్థితులకు దారితీయవచ్చునని తాజా అధ్యయనం హెచ్చరించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, పర్యావరణ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే 1.5 డిగ్రీలు పెరిగినా.. అది భారత్, చైనా, ఇథియోపియా, ఘనా, బ్రెజిల్, ఈజిప్టులలో తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు. భారత్లో 50 శాతం జనాభా 30 ఏండ్ల వ్యవధిలో ఏడాది పాటు కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేశారు. పారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధిస్తే సమస్య ఉండదని పేర్కొన్నారు.