Drone Lands In Jail | ఉగ్రవాదులున్న జైలు వద్ద డ్రోన్.. 8 రోజుల తర్వాత గుర్తింపు
Drone Lands In Jail | ఉగ్రవాదులను ఉంచిన జైలు వద్ద డ్రోన్ ల్యాండ్ అయ్యింది. కెమెరాలున్న దీనిని 8 రోజుల తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ జైలులోని భద్రతా ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి.
భోపాల్: ఉగ్రవాదులను ఉంచిన జైలు వద్ద డ్రోన్ ల్యాండ్ అయ్యింది. (Drone Lands In Jail) కెమెరాలున్న దీనిని 8 రోజుల తర్వాత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ జైలులోని భద్రతా ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడి కేంద్ర కారాగారంలో కరుడు గట్టిన 69 మంది ఉగ్రవాదులను ఉంచిన ప్రత్యేక సెల్ బీ బ్లాక్ సమీపంలో ఒక డ్రోన్ పడి ఉంది. జనవరి 8న భద్రతా సిబ్బంది దీనిని గుర్తించారు.
కాగా, కెమెరాలున్న చైనా తయారీ డ్రోన్ భోపాల్ జైలు వద్ద కనిపించడం కలకలం రేపింది. డిసెంబర్ 31న అది అక్కడ ల్యాండ్ అయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా భద్రతా సిబ్బంది తెలుసుకున్నారు. గత ఎనిమిది రోజులుగా జైలు ప్రాంగణంలో ఆ డ్రోన్ ఉన్నప్పటికీ ఎవరూ గమనించలేదు. ఈ నేపథ్యంలో ఆ జైలులో భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆ డ్రోన్ యజమాని స్థానిక డాక్టర్ స్వప్నిల్ జైన్‌గా పోలీస్ అధికారులు గుర్తించారు. అతడి కుమారుడి కోసం కొన్న ఆ డ్రోన్ డిసెంబర్ 31న నియంత్రణ కోల్పోయి జైలు సమీపంలో పడినట్లు తెలుసుకున్నారు.
కాగా, ఐఎస్వో సర్టిఫైడ్ భోపాల్ జైలులో జామర్లు, సీసీటీవీలు సహా బహుళ స్థాయి భద్రత ఉన్నప్పటికీ వారం రోజులకు పైగా ఆ డ్రోన్‌ను భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం ఆందోళన రేపింది. ఈ నేపథ్యంలో జైలు వద్ద భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైలు, పరిసర ప్రాంతాలను ‘నో-ఫ్లై జోన్’గా పరిగణించాలని యోచిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhopal Jail
- Days After
- drone
- lands
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

