న్యూఢిల్లీ, మార్చి 16: కాఫీ లవర్స్‌కు పరిశోధకులు శుభవార్త చెప్పారు. ప్రతిరోజూ మూడు కప్పు ల కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ ముప్పు తప్పుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. గ్రీన్ టీ, బ్లాక్ టీతోపాటు కాఫీలో ఉండే కెఫీన్ అనే పదా ర్థం మధుమేహ ముప్పును తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆరు దీర్ఘకాలిక అధ్యయనాల్లో పా ల్గొంటున్న దాదాపు 10వేల మంది యురోపియన్ల జన్యు, ఇతర డాటాను పరిశోధకులు పరిశీలించారు.
మెండెలియన్ రాండమైజేషన్ అనే జన్యు పద్ధతిని ఉపయోగించి వారి శరీరంలో కెఫిన్ స్థాయిలు, కొలెస్ట్రాల్ లెవల్స్, డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల ముప్పును విశ్లేషించారు. రక్తంలో కెఫిన్ ఎక్కువగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, తద్వారా వారికి టైప్ 2 డయాబెటిస్, హృద్రోగ సంబంధ వ్యాధుల ముప్పు తప్పుతున్నదని కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ‘బీఎంజే మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.