DRDO Scientist: పాక్ నిఘా ఏజెంట్‌కు ఆకర్షితుడై.. మిస్సైల్ సీక్రెట్లు చెప్పిన డీఆర్డీవో సైంటిస్టు
DRDO Scientist: పాకిస్థాన్ స్పైకు మిస్సైల్ సీక్రెట్లు చెప్పాడు డీఆర్డీవో సైంటిస్టు. వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్‌ను ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌తో పాటు ఇతర విషయాల గురించి పాక్ ఏజెంట్ చాలా సున్నితమైన సమాచారాన్ని రాబట్టినట్లు ఏటీఎస్ పోలీసులు చార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
పుణె: పాకిస్థాన్‌కు చెందిన మహిళా నిఘా ఏజెంట్‌కు ఆకర్షితుడైన డీఆర్డీవో శాస్త్రవేత్త(DRDO Scientist) ప్రదీప్ కురుల్కర్… .. భారతీయ మిస్సైల్ వ్యవస్థ రహ్యసాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ ప్రాజెక్టులకు చెందిన సమాచారాన్ని కూడా పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్లు డీఆర్డీవో శాస్త్రవేత్తపై కేసు దాఖలైంది. జరా దాస్‌గుప్తా పేరుతో పాక్ ఏజెంట్ .. ప్రదీప్‌తో చాటింగ్ చేసినట్లు చార్జిషీట్లో పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు కురుల్కర్‌పై కేసు నమోదు చేశారు.
పుణెలోని డీఆర్డీవో ల్యాబ్‌లో ప్రదీప్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే సీక్రెట్లు చేరవేసిన కేసులో అతన్ని గత వారం కోర్టు ముందు హాజరుపరిచారు. మే 3వ తేదీన ఆయన్ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
జరా దాస్‌గుప్తాతో వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా ప్రదీప్ టచ్‌లో ఉన్నట్లు పోలీసులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారు. బ్రిటన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటూ దాస్‌గుప్తా పరిచేయం చేసుకున్నది. అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపుతూ ప్రదీప్‌ను ఆకర్షించింది. అయితే దాస్‌గుప్తా ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేస్తే అది పాకిస్థాన్ నుంచి ఉన్నట్లు గుర్తించారు.
బ్రహ్మోస్ లాంచర్, డ్రోన్, యూసీవీ, అగ్ని మిస్సైల్ లాంచర్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌తో పాటు ఇతర విషయాల గురించి పాక్ ఏజెంట్ చాలా సున్నితమైన సమాచారాన్ని రాబట్టినట్లు ఏటీఎస్ పోలీసులు చార్జ్‌షీట్‌లో వెల్లడించారు. పాక్ ఏజెంట్ వ్యామోహంలో పడిన అతను డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత ఫోన్లో స్టోర్ చేసుకుని, దాన్ని జరాతో షేర్ చేసినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
వివిధ డిఫెన్స్ ప్రాజెక్టుల గురించి ఆమెతో చాట్ చేసినట్లు ప్రదీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్(ఎస్ఏఎం), డ్రోన్లు, బ్రహ్మోస్, అగ్ని మిస్సైల్ లాంచర్లు, యూసీవీల గురించి అతను చాటింగ్ చేశాడు. ఆ ఇద్దరూ జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు కాంటాక్టులో ఉన్నట్లు ఏటీఎస్ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

