అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచిన డీఆర్డీవో

న్యూఢిల్లీ: నౌకాదళ నౌకలను క్షిపణుల దాడులను నుంచి రక్షించేందుకు అవసరమైన అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీని రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ డెవలప్ చేసింది. డీఆర్డీవో ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది. జోద్పూర్లో ఉన్న డిఫెన్స్ ల్యాబ్లో వీటిని డెవలప్ చేశారు. మూడు రకాల చాఫ్ టెక్నాలజీ వేరియంట్లను రిలీజ్ చేశారు. షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్(ఎస్ఆర్సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్(ఎంఆర్సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్(ఎల్ఆర్సీఆర్) రకాల స్వదేశీ వేరియంట్లను తయారు చేసినట్లు డీఆర్డీవో చెప్పింది. భారతీయ నౌకాదళ అవసరాలకు తగినట్లుగా వీటిని డిజైన్ చేశారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా జోద్పూర్ ల్యాబ్ అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ ఆయుధాలను విజయవంతంగా తయారు చేసినట్లు డీఆర్డీవో చెప్పింది. అరేబియా సముద్రంలోని యుద్ధ నౌకపై మూడు రకాల చాఫ్ టెక్నాలజీ వేరియంట్లను పరిశీలించారు. వాటి పర్పార్మెన్స్ సంతృప్తికరంగా ఉందని కూడా తేల్చారు. శత్రదేశాల రేడార్, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి యుద్ధ నౌకలు తప్పించుకునేందుకు చాఫ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. డీఆర్డీవోకు కంగ్రాట్స్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

