భారత్ లో అందుబాటులోకి రానున్న మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ : భారత్ లో త్వరలో మరో నాలుగు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించవచ్చని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. మరికొన్ని వారాల్లో ఇది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వారాల్లో రోజుకు 73 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా సన్నద్ధమవ్వాలని, ఈ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తిలో 25 శాతం రాష్ట్రాలు సేకరిస్తున్నాయని చెప్పారు. దేశీయంగా తయారయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సేకరిస్తుండగా, ఇందులో 45 ఏండ్ల పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు అందిస్తోందని చెప్పారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేట్ దవాఖానలు నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటు ఉందని అన్నారు. రాష్ట్రాలు సేకరించిన వ్యాక్సిన్లలో అవి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ను చేపడతాయని వీకే పాల్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను అధిగమించేందుకు మనం ఓ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

