DK Shivakumar | ఏ పార్టీతో పొత్తుల్లేవ్.. మూడింట రెండొంతుల సీట్లు కాంగ్రెస్‌కే
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకుగాను మూడింట రెండొంతుల సీట్లు తమకే వస్తాయని చెప్పారు.
ఈసారి తాము ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదల్చుకోలేదని శివకుమార్ తెలిపారు. ఎప్పుడూ కింగ్ మేకర్‌గా జేడీఎస్‌కు ఈసారి ఆ అవకాశం ఉండదని చెప్పారు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను మించి తాము ఘన విజయం సాధించబోతున్నామన్నారు. కన్నడ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, అందుకే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
బీజేపీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలకు దాదాపు 600కు పైగా హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో కేవలం 50 హామీలను మాత్రమే నెరవేర్చిందని డీకే శివకుమార్ విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలపైనే తప్ప అభివృద్ధిపై దృష్టిసారించలేదని ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

