Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Anandiben Patel | ప్రేమ, వివాహబంధంపై యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమిస్తే ప్రేమించండి.. కానీ ఆమెను తల్లిని చేశాక ఒంటరిగా వదిలేయకండి అని అబ్బాయిలకు సూచించారు.
Anandiben Patel | ప్రేమ, వివాహబంధంపై యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నోలోని ఓ ప్రైవేటు కళాశాల ఏడో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె.. ప్రేమ పేరుతో ఓ అమ్మాయితో బంధం ఏర్పరచుకుని, ఆమె తల్లయ్యాక ఒంటరిగా వదిలేయడం సరికాదని అన్నారు. ప్రేమలో ఉండటంలో తప్పు లేదని, అయితే పెళ్లి చేసుకుంటానని మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలని యువతకు సూచించారు. ప్రేమిస్తే ప్రేమించండి.. కానీ ప్రేమ పేరుతో అమ్మాయిని తల్లిని చేసి మోసం చేయకండి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘‘గర్ల్‌ఫ్రెండ్ ఉండటంలో తప్పు లేదు. కానీ, పెళ్లి చేసుకుంటానని మాటిస్తే ఆ మాటను నిలబెట్టుకోవాలి’’ అని ఆనందీబెన్ పటేల్ స్పష్టం చేశారు. చిన్న వయసులోనే బాలికలు తల్లులవడం, ఆ తర్వాత వారి భాగస్వాములు వారిని విడిచిపెట్టడం ఆందోళనకరమని అన్నారు. ‘‘13-14 ఏళ్ల వయసులో ఓ అమ్మాయిని తల్లిని చేసి, ఆ తర్వాత ఆమెను ఒంటరిగా వదిలేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వ చర్యలతోపాటు సమాజం కూడా తన బాధ్యతను గుర్తించాలని సూచించారు.
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధానికి మాత్రమే పరిమితం కాదని గవర్నర్ అన్నారు. దాంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా వస్తాయని గుర్తుచేశారు. యువత ముందుగా ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగాలని, కుటుంబాన్ని పోషించే స్థాయికి చేరుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించారు. భవిష్యత్తులో కలిసి జీవించాలనే హామీలు ఇచ్చే ముందు వాటి పరిణామాలను అర్థం చేసుకోవాలని, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు.
ఆనందీబెన్ పటేల్ గతంలోనూ సంబంధాలు, కుటుంబ విలువలపై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అమ్మాయిలు కెరీర్ కంటే ముందు మంచి తల్లిగా మారాలని గతంలో ఆమె చేసిన సూచనలు వివాదాస్పదమయ్యాయి. అలాగే 2025 అక్టోబరులో బల్లియా, వారణాసిలో జరిగిన విశ్వవిద్యాలయ కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. యువతులు సహజీవన సంబంధాల్లోకి వెళ్లే ముందు వాటి పరిణామాలను ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

