Speaker Om Birla | కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ సింగ్ హుడాకు స్పీకర్ ఓం బిర్లా క్లాస్.. ఏమన్నారంటే..?!
Speaker Om Birla | కాంగ్రెస్ పార్టీ ఎంపీ దీపిందర్ సింగ్ హుడాకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా షాక్ ఇచ్చారు. ఏది అభ్యంతరకరమో, ఏది కాదో తనకు చెప్పక్కర్లేదని సిట్ డౌన్ అంటూ క్లాస్ తీసుకున్నారు.
Speaker Om Birla | కాంగ్రెస్ పార్టీ ఎంపీ దీపిందర్ సింగ్ హుడాకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా షాక్ ఇచ్చారు. ఏది అభ్యంతరకరమో, ఏది కాదో తనకు చెప్పక్కర్లేదని సిట్ డౌన్ అంటూ క్లాస్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. విపక్ష కాంగ్రెస్ ఎంపీ మర్యాదపూర్వకంగా మాట్లాడకపోవడంతో స్పీకర్ ఓం బిర్లాకు కోపం వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత ‘జై సంవిధాన్ (రాజ్యాంగం లాంగ్ లీవ్)’ అని నినదించారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తర్వాత ఇలా మాట్లాడనవసరం లేదని శశి థరూర్ కు సూచించారు. అటుపై శశిథరూర్ వెళుతూ విపక్ష నేత రాహుల్ గాంధీతో కరచాలనం చేశారు. ఈ సమయంలో శశి థరూర్ కు దీపిందర్ సింగ్ హుడా తదితర కాంగ్రెస్ ఎంపీలు మద్దతుగా నిలిచారు.
దీపిందర్ సింగ్ హుడా లేచి స్పీకర్ నుద్దేశించి మాట్లాడుతూ ‘సర్.. మీరు (థరూర్ వ్యాఖ్యపై) అభ్యంతరం చెప్పక్కర్లేదనుకుంటా’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓం బిర్లా మాట్లాడుతూ.. ‘ఏది అభ్యంతరం ఏది అభ్యంతరం కాదో మీరు నాకు చెప్పక్కర్లేదనుకుంటా.. మీరు కూర్చోండి’ అని పేర్కొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్థాన్ నుంచి మూడోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరోవైపు దీపిందర్ సింగ్ హుడా.. హర్యానాలోని రోహతక్ నుంచి 3.4 లక్షల ఓట్ల మెజారిటీతో దీపిందర్ సింగ్ హుడా గెలిచారు.
ఇవి కూడా చదవండి :
Nissan new X-Trail SUV | ఆ ఐదు ఎస్‌యూవీలకు పోటీగా నిసాన్ న్యూ ఎక్స్-ట్రయల్.. వచ్చేనెలలో ఆవిష్కరణ..!
Stock Market Close | కొత్త శిఖరాలకు సూచీలు.. 79వేలు దాటిన సెన్సెక్స్.. 24వేల ఎగువన ముగిసిన నిఫ్టీ..
Hyundai Verna | మారుతి సియాజ్.. హోండా సిటీతో పోలిస్తే.. ఈ కారు మిడ్ సైజ్ సెడాన్ కార్లలో బెస్ట్ ..
Hyundai CNG Car | త్వరలో హ్యుండాయ్ నుంచి డ్యుయల్ సిలిండర్ సీఎన్జీ కారు.. !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

