తిరుప్పూర్ : పెండ్లి కోసం అయ్యే ఖర్చును తగ్గించుకొని మిగిలిన సొమ్మును కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు తమిళనాడుకు చెందిన నూతన జంట. అనూ, అరుల్ ప్రనేశ్కు ఈ నెల 14న వివాహం నిశ్చయమైంది. వివాహ ఖర్చు మొత్తాన్ని రూ.50 లక్షలుగా కుటుంబ పెద్దలు అంచనా వేశారు. కాగా, కరోనా ఆంక్షల నేపథ్యంలో ముందుగా బుక్ చేసుకున్న ఫంక్షన్‌హాల్, ఇతరత్రా ఖర్చులను తగ్గించుకుని ఆ మిగిలిన మొత్తాన్ని (రూ. 37 లక్షలు) కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు.