న్యూఢిల్లీ: వస్తువుల పేర్లను కుక్కలు గుర్తు పట్టగలవని యోట్వోస్ లోరాండ్ యూనివర్సిటీ బృందం గుర్తించింది. వేర్వేరు జాతులకు చెందిన 18 కుక్కలపై ఈ బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీని ఉపయోగించి వాటి మెదడు తరంగాలను పరిశీలించింది. ‘కూర్చో’, ‘తీసుకునిరా’ వంటి పదాలను మాత్రమే కాకుండా మరికొన్ని పేర్లను, అవి ఏయే వస్తువులకు సంబంధించినవో కుక్కలు అర్థం చేసుకోగలుగుతాయని ఈ అధ్యయనంలో తెలిసింది.