మాస్కు ధరించడానికి నిరాకరించిన డాక్టర్.. అరెస్ట్
నిరాకరించిన డాక్టర్| అసలే కరోనా విజృంభిస్తున్న సమయం. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివాటిని తప్పనిసరి చేసింది. అయితే ఇవన్నీ తనకు అవసరం లేదంటున్నాడో డాక్టర్. మాస్కు లేకుండానే

బెంగళూరు: అసలే కరోనా విజృంభిస్తున్న సమయం. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివాటిని తప్పనిసరి చేసింది. అయితే ఇవన్నీ తనకు అవసరం లేదంటున్నాడో డాక్టర్. మాస్కు లేకుండానే సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. మాస్కు పెట్టుకోమని మార్కెట్ సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పైగా వారితో గొడవకు దిగాడు. దీంతో చేసేదేమీలేక మార్కెట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళూరుకు చెందిన బీ శ్రీనివాస్ కక్కిలియా స్వయానా డాక్టర్. రెండు రోజుల క్రితం ఆయన నగరంలోని ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లాడు. అతడు మాస్కు ధరించకపోవడంతో మార్కెట్ సిబ్బంది ఆ డాక్టర్‌కు చెప్పారు. అయితే మాస్కు ధరించడానికి నిరాకరించాడు. పైగా మార్కెట్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఎట్టిపరిస్థిల్లో మాస్కును ధరించేది లేదని.. షాపింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో వారు మంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ డాక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. కాగా, వ్యక్తి కరోనా లక్షణాలు లేనప్పుడు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని డా. శ్రీనివాస్ గతంలో ప్రకటించారు. అదొక ఫూలిష్ రూల్ అని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్‌లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

