చండీగఢ్: ఆవు పేడ, మూత్రంలో రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయని చాలా మంది భారతీయులు నమ్ముతారు. కానీ అందుకు భిన్నంగా సైన్స్ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక డాక్టర్ దీనిని నిరూపించే ప్రయత్నం చేశాడు. లైవ్‌లో ఆవు పేడ తిన్నాడు. మనస్సు, ఆత్మను ఇది శుద్ధి చేస్తుందని వ్యాఖ్యానించాడు. అంతా విస్తూ పోయే ఈ ఘటన హర్యానాలో జరిగింది.
కర్నాల్‌లో చైల్డ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మనోజ్ మిట్టల్ ఇటీవల గోశాలను సందర్శించారు. కింద పడి ఉన్న ఆవు పేడను చేతితో తీసుకున్నారు. ఒక చిన్న పేడ ముద్దను నోట్లో వేసుకుని తిన్నారు. ఆవు పేడ తినడం, ఆవు మూత్రం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీని వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయని అన్నారు.
అంతేగాక నార్మల్ డెలివరీ కోసం మహిళలు పేడ తినాలని డాక్టర్ మనోజ్ సూచించారు. ఆవు పేడ తింటే సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉందని చెప్పారు. ‘ఆవు నుంచి లభించే పంచగవ్యలోని ప్రతి భాగం మానవాళికి ఎంతో విలువైనది. ఆవు పేడ తింటే మన శరీరం, మనస్సు స్వచ్ఛంగా మారుతాయి. మన ఆత్మ పవిత్రమవుతుంది. అది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది’ అని అన్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు మాత్రమే ఆయన చెప్పిన దానికి అంగీకరించారు. మెజారిటీ నెటిజన్లు పలు రకాల ప్రశ్నలతో విమర్శలు చేశారు. ఆవు పేడ తినమని అమాయక పిల్లలకు సూచించవద్దని ఒకరు అన్నారు. ఆ వైద్యుడి లైసెన్స్‌ను భారత వైద్య మండలి రద్దు చేయాలని మరొకరు డిమాండ్ చేశారు.
Dr. Manoj Mittal MBBS MD's prescription. Via @ColdCigar pic.twitter.com/SW2oz5ao0v https://t.co/Gzww80KiSs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) November 16, 2021