న్యూఢిల్లీ, నవంబర్ 30: మొబైల్ ఫోన్ వ్యసనాన్ని అరికట్టేందుకు పంజాబ్లోని ‘ఘోలియా ఖుర్ద్’ అనే కుగ్రామం వినూత్న పోటీకి తెరలేపింది. ‘డూ నథిం గ్’ పోటీని ప్రకటించగా, పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి 55 మంది పాల్గొన్నారు. ‘గ్రేట్ సిట్టింగ్ చాలెంజ్’లో పిల్లలు, మహిళలు, యువత ఉండటం గమనార్హం. మొదటి బహుమతిగా రూ.4,500, సైకిల్ ప్రకటించారు.