తూత్తుకుడి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. గత జూన్ 30న ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి రాధాకృష్ణన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘ఎవరైనా సరే సీఎం స్థానాన్ని గౌరవించాల్సిందే’ అంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. డీఎం కే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.