Tamil Nadu | వార్ వన్‌సైడే.. తమిళనాడులో దూసుకుపోతున్న డీఎంకే కూటమి
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu) వార్ వన్‌సైడ్ అన్నట్లుగా సాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాల్లో డీఎంకే కూటమి 33 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. బీజేపీ, అన్నాడీఎంకే, ఇతరులు ఒక్కో స్థానం చొప్పున మెజార్టీలో కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu) వార్ వన్‌సైడ్ అన్నట్లుగా సాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాల్లో డీఎంకే కూటమి 33 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. బీజేపీ, అన్నాడీఎంకే, ఇతరులు ఒక్కో స్థానం చొప్పున మెజార్టీలో కొనసాగుతున్నారు. సీఎం స్టాలిన్ సోదరి కనిమోలి తూత్తికూడిలో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ బాలు (శ్రీపెరంబుదుర్), దయానిధి మారన్ (సెంట్రల్ చెన్నై), కార్తి చిదంబరం (శివగంగ) లీడ్‌లో కొనసాగుతున్నారు.
ఇక తమిళనాడులో ఈసారి మెజార్టీ సీట్లు సాధించాలనుకున్న బీజేపీకి ఈసారి కూడా తీవ్ర నిరాశే ఎదురయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామళై, (కోయంబత్తూరు), తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా పోటీలో వెనుకబడిపోయారు.
ఇక కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. రాష్ట్రంలో మరోసారి తనకు తిరుగులేదని బీజేపీ నిరూపించుకున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

