DK Shivkumar | ప్రైవేట్ కోటాపై ఇన్వెస్టర్లలో ఆందోళన అవసరం లేదు : డీకే శివకుమార్
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్లవచ్చని పరిశ్రమ సంస్ధ నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈ వ్యవహారంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ప్రైవేట్ కోటాపై ఇన్వెస్టర్లు కలత చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
పెట్టుబడిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..ఇన్వెస్టర్లు కర్నాటకకు రావాలని మేం కోరుకుంటున్నామని డీకే శివకుమార్ పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నైపుణ్యం కలిగిన అభ్యర్ధులు కర్నాటకలో పనిచేసేందుకు తాము స్వాగతిస్తామని చెప్పారు. వారు కర్నాటకలో పనిచేయాలని తాము ఆశిస్తామని తెలిపారు. బయటి ప్రాంతాల వారు ఇక్కడ పనిచేసేందుకు వస్తుండటంతోనే బెంగళూర్ జనాభా 1.4 కోట్లకు పెరిగిందని వివరించారు. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
తాము కేవలం స్ధానికులకు (కన్నడిగులు) పనిచేసే అవకాశం కల్పించాలనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కన్నడిగులకు ఉపాధి అవకాశాలను ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై తాము దృష్టిసారిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
నాస్కామ్ ప్రకటనను ప్రస్తావిస్తూ నాస్కామ్ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదని, తాము వారితో మాట్లాడతామని డీకే శివకుమార్ భరోసా ఇచ్చారు. కాగా, ప్రైవేట్ కంపెనీలు, సంస్ధల్లో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 75 శాతం కన్నడిగులకు అవకాశం కల్పించాలనే బిల్లుకు సోమవారం కర్నాటక క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
Read More :
Bharateeyudu 2 | భారతీయుడు -2 నిడివి తగ్గించలేదు.. శంకర్ ఒప్పుకోలేదా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

