Most Hated Mithai | దీపావళి సందర్భంగా ఒక కంపెనీ తమ ఉద్యోగులకు సోన్ పాపిడి డబ్బాను గిఫ్ట్‌గా ఇవ్వగా.. ఉద్యోగులు ఆ బహుమతిని కంపెనీ గేటు దగ్గర విసిరి పడేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానాలోని గన్నౌర్ ఇండస్ట్రీ ఏరియాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
దీపావళి సందర్భంగా వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు బహుమతులును ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హర్యానాలోని ఒక కంపెనీ తమ ఉద్యోగులకు సోన్ పాపిడీ డబ్బాను గిప్ట్గా ఇవ్వగా.. బోనస్ కాకుండా సోన్ పాపిడీని గిప్ట్గా ఇవ్వడంతో విసుగెత్తిన ఉద్యోగులు ఆ సోన్ పాప్డీ డబ్బాలను కంపెనీ గేట్ ముందు పడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు చాలామంది ఉద్యోగులు స్వీట్స్, డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా క్యాష్ బోనస్ (Cash Bonus) లేదా ఆన్లైన్ గిఫ్ట్ కార్డులను (Online Gift Cards) కోరుకుంటున్నట్లు ఒక సర్వేలో తేలింది.
Diwali Kalesh
A company gave its employees the famous most hated alleged Mithai called Soan Papdi
The employees threw the Soan Papdi boxes at the gate of the company.
Soan Papdi deserves this insult 🙂
What is your opinion on alleged mithai called soan papdi? pic.twitter.com/HSRPDC322r
— Woke Eminent (@WokePandemic) October 21, 2025