కేన్సర్‌తో పోరాడుతూ కూడా కసిగా చదివిందా అమ్మాయి. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో 81.60 శాతం మార్కులు సాధించింది. ఆమె ఎవరో కాదు థానేలోని సరస్వతి సెకండరీ స్కూల్లో చదువుకునే దివ్య పావలే. కేన్సర్‌తో పోరాడుతూ కూడా కష్టపడి చదువుకొని పది పరీక్షల్లో పాసయింది దివ్య. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
సోమవారం సాయంత్రం దివ్య కన్నుమూసింది. దివ్యకు టీ-సెల్ లింఫోమా కేన్సర్ ఉన్నట్లు గతేడాది వెల్లడైంది. దీంతో ఆమెకు 14 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, 15 తెల్లరక్తకణాల ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అని వైద్యులు తేల్చారు. ఈ కారణంగా గతేడాది ఒక్కరోజు కూడా స్కూల్‌కు రాని దివ్య.. ప్రాక్టికల్ పరీక్షలకు కొన్నిరోజుల ముందు కూడా కీమోథెరపీ చేయించుకుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. కానీ పరీక్షల ఫలితాలు వెల్లడైన కొన్ని రోజులకే ఆమె మరణించడంతో.. దివ్య కుటుంబం విషాదంలో మునిగిపోయింది.