ముంబై, ఆగస్టు 29: లివా మిస్ దివా యూనివర్స్-2022 కిరీటాన్ని కర్ణాటక మోడల్ దివితా రాయ్ దక్కించుకున్నది. ఈ పోటీలతో దివితా మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నది.
తెలంగాణకు చెందిన ప్రజ్ఞ అయ్యగారి మిస్ దివా సుప్రానేషనల్-2022 కిరిటీం దక్కించుకున్నది. ఈమె అంతర్జాతీయ మిస్ సుప్రానేషనల్ పోటీల్లో భారత్ తరపున పాల్గొననున్నది. మిస్ పాపులర్ చాయిస్గా ఓజస్వీశర్మ నిలిచింది.