దళాల ఉపసంహరణ ఒప్పందంతో మేలు జరగలేదు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఏడాది కాలం ముగిసినా.. చైనా ఇంకా భారతీయ భూభాగాన్ని ఆక్రమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 20 మంది అమర జవాన్ల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం నుంచి బదులు కోసం ఎదురుచూస్తున్నాయని, ప్రధాని మోదీ వరుసగా అబద్దాలు చెబుతున్నట్లు ఇవాళ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను సగర్వంగా స్మరిస్తున్నామని సోనియా అన్నారు. అయితే దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఏప్రిల్ 2020 కన్నా ముందు ఉన్న పరిస్థితిని నెలకొల్పేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సోనియా వెల్లడించారు. చైనాతో జరిగిన దళాల ఉపసంహరణ ఒప్పందం వల్ల భారత్కు మేలు జరగలేదని ఆమె విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

