ఈ మధ్య చిత్ర విచిత్రమైన ఆహార పదార్థాలు దర్శనమిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి దృష్టి మరల్చేందుకు హోటల్ నిర్వాహకులు వెరైటీ ప్రయోగాలు చేస్తున్నారు. చాక్లెట్ ఐస్‌క్రీం దోశ, ఐస్‌క్రీం మ్యాగీ, ఐస్‌క్రీం కచోరీ, పచ్చి మిర్చి హల్వా ఇలా ఒక్కటేంటి నెట్టింట ఎన్నో వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఇటీవల వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జాబితాలో వెరైటీ శాండ్విచ్ చేరిపోయింది. ఈ శాండివిచ్ తయారీని చూసి నెటిజన్లు యాక్… అని అంటున్నారు.
‘దిల్వాలా శాండ్విచ్ ఫ్రం భావ్‌నగర్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను గుజరాత్‌లోని భావ్నగర్లోగల హితేష్ శాండ్విచ్ స్టాల్లో చిత్రీకరించారు. ఇందులో ఓ వీధి వ్యాపారి విచిత్రమైన ఐస్‌క్రీమ్ శాండ్విచ్ను తయారు చేశాడు. అతడు మొదట ఓ బ్రెడ్‌ను లవ్ షేప్‌లో కట్‌చేశాడు. దానిపై బట్టర్, జామ్ పూశాడు. అనంతరం చాక్లెట్‌ను తురిమి, చాకోబార్ ఐస్క్రీంను సగానికి కట్‌చేసి శాండ్విచ్లో పెట్టాడు. దాన్ని రెండుగా కట్‌చేసి కస్టమర్‌కి సర్వ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఆరు లక్షల మంది వీక్షించారు. ‘ఇదెక్కడి పోయేకాలంరా’ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
gujaratis bc 😭 pic.twitter.com/gKAvnWFOhr
— P (@infallible_23) June 23, 2022