ఆదివారం 12 జూలై 2020
National - Jun 25, 2020 , 17:51:00

ఏపీడీసీని ప్రారంభించిన నవీన్‌ పట్నాయక్‌, కేంద్రమంత్రి

ఏపీడీసీని ప్రారంభించిన నవీన్‌ పట్నాయక్‌, కేంద్రమంత్రి

భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి గురువారం పారాదీప్‌లో ఇండియన్ ఆయిల్ ఏర్పాటు చేసిన ప్రొడక్ట్ అప్లికేషన్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్ (పీఏడీసీ)ను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఐఓసీఎల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్‌ను ఆనుకొని రూ.43కోట్ల వ్యవయంతో ఐదెకరాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ.. కొత్త మెటీరియల్స్‌ తయారు చేయడంలో పీఏడీఎసీల్‌ కీలకపాత్ర పోషించడంతో పాటు ప్లాస్టిక్‌, పాలిమర్‌ రంగాల్లో ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయడంలో పెట్టుబడిదారులకు తోడ్పాటనందిస్తుందని పేర్కొన్నారు. పాలిమర్ అప్లికేషన్ల రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. 


logo