Maha Dy CM Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్: అమిత్షా
Maha Dy CM Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు.
Maha Dy CM Fadnavis | మహారాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు జరుగుతున్నాయి. మైనారిటీలో పడ్డ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ-శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గురువారం ఫడ్నవీస్ నివాసంలో ఆయన్ను శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కలుసుకున్నారు. ఈ సందర్భంగా తదుపరి సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు.
తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్షా మరో సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యర్థన మేరకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారని ట్వీట్ చేశారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. తమ వ్యక్తిగత అభ్యర్థన మీద దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారు అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

