ఢిల్లీలో విద్యార్థుల మెరుపు నిరసనలు
భారీ పోలీసు మోహరింపు మధ్య సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, మండీ హౌస్ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు, విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు శుక్రవారం మెరుపు నిరసనలు తెలియచేశారు. కన్నాట్ ప్లేస్ లోపలి వలయం గుండా నడుస్తూ, మధ్యమధ్యలో ‘జై హింద్' అని నినాదాలు చేస్తూ నిరసనకారులు చెల్లాచెదురై వేర్వేరు ప్రదేశాలలో తిరిగి ఏకమయ్యారు.
- కన్నాట్ ప్లేస్, మండీ హౌస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు
- ఆందోళనల్లో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ, ఏఐఎస్ఏ సభ్యులు
- నిరసనకు ముందే అదుపులోకి అభిజీత్ దీప్కే, నేహా బోరా
న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : భారీ పోలీసు మోహరింపు మధ్య సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, మండీ హౌస్ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు, విద్యార్థి సంఘాలకు చెందిన సభ్యులు శుక్రవారం మెరుపు నిరసనలు తెలియచేశారు. కన్నాట్ ప్లేస్ లోపలి వలయం గుండా నడుస్తూ, మధ్యమధ్యలో ‘జై హింద్’ అని నినాదాలు చేస్తూ నిరసనకారులు చెల్లాచెదురై వేర్వేరు ప్రదేశాలలో తిరిగి ఏకమయ్యారు. కొందరు జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను వెనక్కి తీసుకోవాలని, 2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అఖిల భారత విద్యార్థుల సంఘం(ఏఐఎస్ఏ) సభ్యులు మండీ హౌస్ వద్ద మెరుపు నిరసన తెలిపారు. కన్నాట్ ప్లేస్‌లో తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’(త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దాం) నిరసన కార్యక్రమానికి ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
సెంట్రల్ ఢిల్లీలోని ఝండేవాలన్‌లో ఉన్న నివాసం నుంచి దీప్కేను, మండీ హౌస్ వద్ద నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ గుమికూడిన జనం, కెమెరా బృందాలు, భారీ సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించిన సమయంలో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సీజేపీ పిలుపు మేరకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌కు ప్రతిస్పందనగా ఈ నిరసనలు జరిగాయి. అయితే కన్నాట్ ప్లేస్, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రజలు గుమికూడడాన్ని నిషేధిస్తూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద జారీ చేసిన నిషేధాజ్ఞలను పేర్కొంటూ ఈ ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. న్యూఢిల్లీ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు 6,000 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బందిని, ఒక్కదానిలో సుమారు 100 మంది సిబ్బంది ఉన్న 220 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) కంపెనీలను మోహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

