ఎర్రకోట సమీపంలో డ్రోన్ కలకలం

న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో ఎగురుతున్న డ్రోన్ను ఢిల్లీ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా ఎగిరిన డ్రోన్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్కు పోలీసులు అనుమతి ఇవ్వగా డ్రోన్ ఎగిరేందుకు ఎలాంటి ఆమోదం లభించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వెబ్ సిరీస్ రూపకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వారం ఆరంభంలో ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం.
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఆగస్ట్ 15 వేడుకల నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముఖ్యంగా ఎర్రకోట ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్ధలు డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో ఎర్రకోట ప్రాంతంలో డ్రోన్ కదలికలు ఆందోళన రేకెత్తించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

