ఢిల్లీ హనుమజ్జయంతి అల్లర్లు : 9 మంది అరెస్ట్.. ఎఫ్ఐఆర్ నమోదు
హనుమజ్జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలో 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక.. ఈ హింసాత్మక ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నాడని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై విచారణను ప్రారంభించామని ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ హింసాకాండకు సంబంధించి దాదాపు 100 సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అవి కూడా తమకు దొరికాయని తెలిపారు. ఈ సీసీ ఫుటేజీల ఆధారంగానే ఈ అల్లర్లకు కారకులైన మరికొంత మందిని గుర్తిస్తామని, అంతేకాకుండా స్పెషల్ టీమ్, స్పెషల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగామని అధికారులు తెలిపారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జహంగిర్పూరి ప్రాంతంలోని కుశాల్ సినిమా థియేటర్ దగ్గరకు రాగానే ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు విసిరేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
రాళ్లదాడిలో పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కొన్ని వాహనాలకు దుండగులు నిప్పు పెట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. సోషల్మీడియాలో ప్రచారమయ్యే వదంతులను నమ్మొద్దని పౌరులకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

