Pregnancy Termination | అనారోగ్య గర్భాన్ని తొలగించుకోవచ్చు
Pregnancy Termination | అనారోగ్యంతో ఉన్న పిండాన్ని తొలగించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మన్నించింది. సమస్యలతో కూడుకొన్న గర్భాన్ని తొలగించుకోవడం అనేది రాజ్యాంగం లోని 21 అధికరణంలోని

28 వారాల గర్భవతికి ఢిల్లీ హైకోర్టు అనుమతి
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న పిండాన్ని తొలగించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మన్నించింది. సమస్యలతో కూడుకొన్న గర్భాన్ని తొలగించుకోవడం అనేది రాజ్యాంగం లోని 21 అధికరణంలోని వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందని నొక్కి చెప్పింది. సదరు మహిళ 28 వారాల గర్భాన్ని వైద్య పర్యవేక్షణలో తొలగించాలని జస్టిస్ జ్యోతిసింగ్ శనివారం ఆదేశించారు. కడుపులో ఉన్న శిశువుకు అసాధారణమైన జన్యుపరమైన గుండెజబ్బుతో ఉన్నదని, పుట్టిన తర్వాత నిరంతరం వైద్య పర్యవేక్షణలోనే గడపాల్సి వస్తుందని అన్నారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించక తప్పదని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా గర్భవిచ్ఛిత్తి పర్యవసానాలపై ఈ కేసులో నియమితమైన వైద్యబోర్డు పిటిషనర్ మహిళకు, ఆమె భర్తకు వివరించాలని సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

