Delhi Exit Poll 2025 | దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 57.70శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్ వివరాలను ప్రకటించాయి. ఈ సారి ఢిల్లీ పీఠం బీజేపీదేనని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేవీసీ పోల్ బీజేపీకి 39-45, ఆమ్ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి.
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్, బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా కల్కాజీ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి రమేశ్ బిధురి పోటీ చేస్తున్నారు.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆరు సర్వే ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పాయి. అయితే, ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆప్ కు భారీ విజయాన్ని అంచనా వేయలేకపోయాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ 45 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 24 సీట్లు, కాంగ్రెస్ కేవలం ఒక సీటు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రం ఆప్ గరిష్ఠంగా 53 సీట్లు గెలిచింది. ఇండియా టీవీ-సీ ఓటర్ సర్వే కనీసం 35 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది.
2020లో జరిగిన ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా, కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలువలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం మరోసారి ఫలితాల్లో కనిపించింది. ఎనిమిది సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సాధిస్తుందని చెప్పాయి. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు కొద్దిగా దగ్గరా వచ్చాయి. ఆప్ పార్టీ 59-68 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఈ ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి సగటున 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆ పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ సున్నా నుంచి ఒక సీటు మాత్రమే వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ ఖాతా సైతం తెరువలేకపోయింది.