న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై అటాక్ చేసిన వ్యక్తిని రాజేశ్ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నివాసిగా భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం రాజేశ్ వయసు 41 ఏళ్లు. తన బంధువు ఒకరు ఓ కేసులో అరెస్టు అయ్యారు, అయితే ఆ వ్యక్తిని విడిపించే అంశాన్ని సీఎం రేఖాతో చర్చించేందుకు నిందితులు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎంపై జరిగిన అటాక్‌కు చెందిన వివరాలను ప్రత్యక్ష సాక్షులు వెల్డించారు. కొన్ని డాక్యుమెంట్లతో రాజేశ్.. సీఎం రేఖా వద్దకు వెళ్లాడు. అయితే ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా ఆమెపై అరవడం మొదలుపెట్టాడతను. ఆ తర్వాత సీఎంపై అటాక్ చేశాడు. నిందితుడు రాకేశ్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ పోలీసులు ఇంకా దీన్ని ద్రువీకరించలేదు. సీఎంపై దాడి చేసిన మరుక్షణమే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవాళ ఉదయం జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దాడి జరిగింది. ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తున్న టైంలో రాజేశ్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ అటాక్ వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ మాజీ సీఎం అతిషి దాడి ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. నిందితుడిపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సెక్యూర్టీ లోపంపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. పోలీసు కమీషనర్ ఎస్బీకే సింగ్ ఈ ఘటనలో దర్యాప్తు కొనసాగించనున్నారు. రాకేశ్ గురించి మరో అంశం కూడా బయటపడింది. అతని కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. రాకేశ్‌కు కుక్కలంటే ఇష్టమని ఆమె తల్లి భాను చెప్పింది. అయితే ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాకేశ్ నిరాశకు లోనయ్యాడని ఆమె చెప్పింది.