Arvind Kejriwal | నేడు కోల్‌కతాకు ఢీల్లీ సీఎం.. ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని దీదీని కోరనున్న కేజ్రీవాల్
ఢిల్లీలో (Delhi) అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (LG)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో (Delhi) అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (LG)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆర్డినెన్స్‌కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా తిరుగనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) సమావేశం కానున్నారు. నేరుగా కోల్‌కతా చేరుకోనున్న కేజ్రీవాల్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో దీదీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని కోరనున్నారు.
ఈ నెల 24, 25 తేదీల్లో ముంబైలో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు. కాగా, ఇదే విషయంమై కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు మద్దతు ప్రకటించింది. పార్లమెంట్లో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటికే బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేజ్రీవాల్‌తో సమావేశమై తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆప్ పోరుబాట..
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ (AAP) సర్కార్ పోరుబాటకు సిద్ధమైంది. ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రజల వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘నల్ల ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా జూన్ 11న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ర్యాలీ చేపడుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే నెల నిర్వహించనున్న ర్యాలీకి ఢిల్లీ ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Arvind Kejriwal
- Congress
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

