ఢిల్లీలోనూ కంటి వెలుగు.. ప్రకటించిన సీఎం కేజ్రీవాల్
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు.
- తెలంగాణ పథకం చాలా బాగుంది
న్యూఢిల్లీ, జనవరి 25: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు పథకంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఈ పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం అభినందనీయమని ప్రశంసించారు. సమస్యల పరిష్కారానికి ఒక రాష్ర్టాన్ని చూసి మరో రాష్ట్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బుధవారం ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రిపబ్లిక్‌డే కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. కేంద్రం నియమిస్తున్న గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రజల ద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తూ వాటి విధులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యానికి వీరొక అజ్ఞాత నీడలా పరిణమిస్తే పాలన ఎలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లాత్ సాహెబ్ (గవర్నర్లు, ఎల్జీలు)ల గురించి ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించాలో మనమందరం ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అటు న్యాయవ్యవస్థతోపాటు ఇటు విపక్ష పాలిత రాష్ర్టాలతో నిత్యం ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నదని ఆయన విమర్శించారు. రైతులు, వ్యాపారులతో సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నదన్నారు. కేంద్రం ఆహార వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించాలని, అలా చేస్తే దేశంలోని చాలామందికి మేలు జరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, చైనాతో భారత వాణిజ్యం 50 శాతం పెరిగిందని పేర్కొన్నారు. పొరుగుదేశానికి గట్టి సందేశం పంపేందుకు ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

