న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తున్నది. అక్కడి గాలి నాణ్యత రోజురోజుకు మరింత క్షీణిస్తున్నది. ఇవాళ ఉదయం ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్మింది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత మరింత పడిపోవడం కూడా నగరంపై పొగమంచు దట్టంగా కమ్మడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇవాళ ఢిల్లీలో సగటు గాలి నాణ్యత రికార్డు స్థాయిలో 317కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ ఏరియాల్లో AQI 311గా ఉన్నది. లోధి రోడ్ ఏరియాలో కాస్త తక్కువగా 303 ఉన్నది. మథుర రోడ్లో అత్యధికంగా 332 స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్టు టర్మినల్లో 334గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం.
Delhi | As winter sets in, a layer of smog prevails in the morning over the national capital Delhi. Air quality is in ‘Very Poor’ category with an overall AQI of 317 today. pic.twitter.com/wf8WwuMwE5
— ANI (@ANI) November 28, 2022