న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. నజఫగఢ్ ఏరియాలో వరద తాకిడికి రోడ్డు కింది భాగం కొట్టుకుపోవడంతో రోడ్డు కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది. అయితే ఆ గోతిని చూసుకోకుండా ఓ డ్రైవర్ లారీని ముందుకు నడుపడంతో అది ఆ గోతిలోకి దూసుకుపోయింది. గోతికి ఇరుపక్కల సరైన హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తున్నది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: A truck fell into a caved in portion of the road in Najafgarh pic.twitter.com/MfW8iRigsO
— ANI (@ANI) May 20, 2021